Ayyappa Swamy devotees in AP: గుడినే కాదు గుడిలో లింగాన్ని మింగే వారు ఉన్నారు ఈరోజుల్లో. వారి కన్ను అయ్యప్ప భక్తుల ఇరుముడులపై పడింది. ఇంకేముంది ఇరుముడినే దోచుకెళ్లారు. భక్తి శ్రద్దలతో పుజలు నిర్వహించుకుంటున్న అయ్యప్ప స్వాములపై దొంగల కన్నుపడింది. అనుకున్నదే తడవుగా అయ్యప్ప స్వాముల ఇరుముడులను దొంగలు దోచుకెళ్లారు. మహానంది- ఎంసీ ఫారం మధ్య చోరీ జరిగినట్లు స్వాములు తెలిపారు. కదులుతున్న బస్సులో నుంచి ఇరుముడులు దించేసిన దుండగులు వాటితో పారిపోయినట్లు అయ్యప్ప స్వాములు వెల్లడించారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వాములు కోరుతున్నారు. ఈ ఘటనపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
అయ్యప్ప స్వాముల ఇరుముడులను దోచుకెళ్లిన దొంగలు... ఎక్కడంటే.? - అయ్యప్ప భక్తుల ఇరుమడిని దొచుకెళ్లిన దొంగలు
Ayyappa Swamy devotees: అయ్యప్ప స్వాముల ఇరుమడిని దొచుకెళ్లిన ఘటన నంద్యాల జిల్లా మహానందిలో చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులోంచి స్వాముల ఇరుముడులు తీసుకుని పారిపోయినట్లు వారు తెలిపారు. ఘటనపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
Ayyappa Swamy devotees
Last Updated : Nov 29, 2022, 12:28 PM IST