chain snatching in cc footage ఇంటి బయట తన బాబుకు అన్నం తినిపిస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాగేందుకు ఓ దొంగ ప్రయత్నించిన ఘటన.. నంద్యాలలో జరిగింది. ఒక్కసారిగా మెడలోంచి గొలుసు లాగే సరికి బాబుతో సహా సదరు మహిళ కింద పడిపోయింది. అయినా. ఆమె మెడలో నుంటి గొలుసులాగే దొంగ ప్రయత్నించడంతో.. వెంటనే మేల్కొన్న మహిళ గట్టిగా అరచింది. దీంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. నంద్యాల బైర్మల్ వీధిలో జరిగిన ఘటనకు సంబంధించిన దశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
CC Foootage మహిళ మెడలోంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించిన దొంగ - తెలుగు తాజా
cc footage మహిళ మెడలో బంగారు గొలుసును లాగేందుకు ఓ దొంగ విఫలయత్నం చేశాడు. సదరు మహిళ గట్టిగా అరవడంతో.. కాళ్లకు బుద్ది చెప్పాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

గొలుసు లాగేందుకు ప్రయత్నించిన దొంగ