ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీం కోర్టు చొరవతో అహోబిలం దేవ‌స్థాన సమస్య పరిష్కారం..

Ahobilam: అహోబిలం దేవ‌స్థానానికి సంబంధించి సమస్య పరిష్కారం అయింది. దేవాదాయశాఖ- అహోబిలం మఠానికి మధ్య జరుగుతున్న పోరుకు సుప్రీం కోర్టు తెర దింపింది. దేవస్థానం నిర్వహణ దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని తెల్చిచెప్పింది. అభివృద్ధికి నోచుకోని అహోబిలంపై ప్రత్యేక కథనం.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 9, 2023, 2:07 PM IST

అహోబిలం దేవ‌స్థానానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం

Ahobilam : నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం క్షేత్రంలో ఆలయ నిర్వహణ విషయంలో ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తోంది. అహోబిలం మఠం- దేవాదాయశాఖ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆలయానికి ప్రభుత్వం కార్యనిర్వాహన అధికారిని నియమించింది. దానిని సవాల్‌ చేస్తు స్థానికులు, భక్తులు కోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జనవరి 27 న హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో... అహోబిలం ఆలయం పూర్తిస్థాయిలో మఠం ఆధీనంలోకి వెళ్లిపోయింది.

ఎంతో ప్రాశస్త్యం ఉన్న అహోబిలం క్షేత్రంలో.. అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దిగువ, ఎగువ అహోబిల ఆలయాలు.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నాన ఘట్టాలు, దుస్తులు మార్చుకునేందుకు గదులు లేక మహిళలు అవస్థలు పడుతున్నారు. ఆలయ ప్రాంగణాల్లో అపరిశుభ్రత తాండవిస్తూ పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.

నవ నారసింహ క్షేత్రాలకు ఎలా వెళ్లాలో తెలిపే సమాచారం కానీ, సూచిక బోర్డులు లేకపోవటంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. మఠానికి-దేవాదాయ శాఖకు సంబంధించిన సమస్య పరిష్కారం కావటంతో స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భక్తుల సౌకర్యం కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details