SHOPS REMOVING ISSUE IN SRISAILAM : శ్రీశైలంలోని ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాల తరలింపునకు అధికారులు సిద్ధమయ్యారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం పాత దుకాణదారులకు దేవస్థాన పరిధిలోని లలితాంబికా సముదాయంలో 125 దుకాణాలను అధికారులు కేటాయించారు. కేటాయించిన దుకాణాల్లోకి వెళ్లకుండా వ్యాపారులు జాప్యం చేస్తుండడంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పాత దుకాణాలన్నింటినీ అధికారులు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు దేవస్థానం అధికారులు జేసీబీ సాయంతో దుకాణాల ముందు గుంతలు తీయించారు.
శ్రీశైలంలో దుకాణాల తొలగింపులో అధికారుల ముందడుగు.. జేసీబీతో గుంతల తవ్వకం - పాత దుకాణాల తరలింపునకు అధికారుల ముందడుగు
SHOPS REMOVING ISSUE: శ్రీశైలం మల్లిఖార్జున స్వామివారి దేవస్థానానికి ఇరువైపుల ఉన్న పాత దుకాణాల తరలింపునకు అధికారులు ముందడుగు వేశారు. వ్యాపారులకు కొత్త సముదాయాలు కేటాయించిన అక్కడికి వెళ్లకపోవడంతో అధికారులే దగ్గరుండి జేసీబీ సాయంతో దుకాణాల ముందు గుంతలు తీయించారు.
SHOPS REMOVING ISSUE IN SRISAILAM
దుకాణాల తరలింపు విషయంలో దేవస్థానం అధికారులు, వ్యాపార సంఘాల నాయకులు పట్టుదల వైఖరి అవలంబిస్తున్నారు. దుకాణాల తరలింపు విషయంపై 24 మంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు వ్యాపారుల పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
ఇవీ చదవండి: