TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest: "చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలి"..కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest :మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుని జైలు నుంచి విడుదల చేసే వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళనలు శాంతియుతంగా కొనసాగించనున్నట్లు కాలవ ప్రకటించారు.
TDP Cadres Stage Relay Hunger Strikes : వైసీపీ నాయకుల సునకానందం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో పాటు రిలే నిరాహార దీక్షలో రైతులు పాల్గొన్నారు. పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎటువంటి ఆధారాలు చూపకపోవడం శోచనీయమన్నారు.
కారాగారంలో సెల్ ఫోన్లు వాడరాదని నిబంధన ఉన్న చంద్రబాబు నాయుడు కారాగారంలోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి జగన్‌కు పంపే బాధ్యతను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైసీపీ వారు సునకానందం పొందుతున్నారని మండిపడ్డారు.
TDP Leaders Rally Against Chandrababu Arrest in AP: వర్షంలోనూ దీక్షలను కొనసాగించిన టీడీపీ శ్రేణులు.."కుట్రపూరితంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు"
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన : సత్యసాయి జిల్లా గుడిబండలో టీడీపీ నేత తిప్పేస్వామి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. రొల్లలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు..
వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను ప్రజలు సంఘటితంగా ఎదుర్కొవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు NMD ఫరూక్ అన్నారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని పలువులు టీడీపీ నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు.
TDP Leaders Agitations Continues Against CBN Arrest బాబు కోసం కదిలుతోన్న ఊరూవాడా..'బాబుతో మేము సైతం' అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ప్రత్యేక పూజలు : చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల జిల్లా కంకటపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వివిధ జిల్లాలో నిరసనల వెల్లువ : కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో టీడీపీ సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని దీక్షా శిబిరాన్ని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో దీక్షలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో టీడీపీ శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.
Womens Protest Against Chandrababu Arrest in Vijayawada: 'బాబుతో మేము సైతం'.. విజయవాడలో ధ్వజమెత్తిన మహిళలు