ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ... నంద్యాల జిల్లా డోన్‌లో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. డోన్‌లో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కొందరు యువకులు వెంటపడి వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని... విద్యార్థి సంఘాల ర్యాలీ - డోన్‌లో విద్యార్థి సంఘాల ర్యాలీ
నంద్యాల జిల్లా డోన్‌లో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అమ్మాయిలకు రక్షణ కల్పించాలన్నారు.
కొద్దిరోజుల క్రితం పాతపేట స్కూల్ దగ్గర ఓ ఆకతాయి.... విద్యార్థిని వెంటపడి వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి నిరసనగా.. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు...నిరసన చేపట్టారు. ఆకతాయిని శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Protest on Power cuts: విద్యుత్ కోతలపై.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు