Chenna Siddha Rama Panditharadhya: శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి చేపట్టిన మహా పాదయాత్ర ఘనంగా ముగిసింది. ఈరోజు ఉదయం 9 గంటలకు పీఠాధిపతి శ్రీశైలానికి చేరుకున్నారు. శ్రీశైలంలోని టోల్గేట్ వద్ద పీఠాధిపతికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి , దేవస్థానం ఈవోఎస్ లవన్న, అర్చకులు, స్థానిక భక్తులు స్వాగతం పలికారు. పీఠాధిపతి వెంట వందలాది మంది కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చారు.
కర్ణాటక నుంచి శ్రీశైలానికి చేరుకున్న జగద్గురు పీఠాధిపతి మహా పాదయాత్ర - Details of Siddha Rama Panditaradhya Swamy
Chenna Siddha Rama Panditharadhya: శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామి చేపట్టిన మహా పాదయాత్ర నేటితో ముగిసింది. అక్టోబర్ చివరి వారంలో.. కర్ణాటకలోని శ్రీ క్షేత్రం నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్ర.. నేడు శ్రీశైలం వద్ద పూర్తవడటంతో.. వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వాగతం పలికారు..
డాక్టర్ చెన్న సిద్ధ రామ పండితారాధ్య శివాచార్య స్వామి మహా పాదయాత్ర
అక్టోబర్ 29వ తేదీన కర్ణాటకలోని బెలగాం జిల్లా యడూర్ శ్రీ క్షేత్రం నుంచి పీఠాధిపతి పాదయాత్ర ప్రారంభించారు. లోక కళ్యాణం కోసం సుమారు 43 రోజుల పాటు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. స్వామీజీ పాదయాత్ర వెంట శివశరణులైన మహా భక్తులు అక్కమహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ విగ్రహమూర్తులను వాహనాల్లో నెలకొల్పి భక్తి ప్రపత్తులతో శ్రీశైలం చేరుకున్నారు.
ఇవీ చదవండి:
TAGGED:
శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి