ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేడుకల వేళ.. మొబైల్​తో కాలం గడిపితే ఎలా గురూ..! - ఏపీ ప్రధాన వార్తల

Stay Away from Phone on Sankranti : ఈ బిజీ జీవితంలో మొబైల్​ ఫోన్​ నిత్యావసరంగా మారిపోయింది. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ పడుకునే వరకు నిరంతరం ఆ ఫోన్​తోనే ఉంటాము. తిండి లేకపోయినా ఉండగలము గానీ ఈ ఫోన్​ లేకపోతే ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. కానీ ఈ పండగ రోజుల్లోనూ చరవాణితోనే కాలం గడిపితే ఎలా గురూ. అందుకే కాస్త దానికి విరామం ఇద్దాం.. జాలీగా కుటుంబంతో కలిసి కాస్త సమయం గడుపుదాం.

mobile
mobile

By

Published : Jan 15, 2023, 1:04 PM IST

Stay Away from Phone on Sankranti : బోలెడు కబుర్లు, నవ్వులతో సరదా సరదాగా సాగితేనే కదా పండగ. అందరూ తలా ఒక ఫోన్‌లో మునిగిపోతే అది వట్టి సెలవుగానే మారిపోదూ! ఈ పండక్కి ఫోన్‌ డిటాక్స్‌ మంత్రం జపించేయండి.

  • ఫోన్‌లు, ట్యాబ్‌లు అన్నింటినీ కళ్ల ముందు లేకుండా పక్కన పడేయండి. అన్నీ స్విచాఫ్‌ చేయడం కష్టమే. అత్యవసరమై ఎవరైనా సంప్రదించాలన్నా ఇబ్బంది. కాబట్టి, ఒకట్రెండు ఆన్‌లో ఉంచుకోండి. సమస్య ఉండదు, అతి వాడకమూ తగ్గుతుంది.
  • మనకంటే పని ఉంటుంది. కాబట్టి, ఫోను మొహం చూసే అవకాశం తక్కువ. మరి శ్రీవారో! పిల్లల్ని వద్దని ఆయన చేతిలోకి తీసుకుంటే వాళ్లు గొడవ చేయడం ఖాయం. ఆయనకీ ఈ నిబంధన వర్తిస్తుందని ముందుగానే చెప్పండి. ఆఫీసు పని వంటి వాటిని తర్వాతి రోజుకు మార్చుకోమని ముందే చెబితే ఆయనా మొబైల్‌కు దూరంగా ఉండొచ్చు. నిజంగానే అర్జెంటు పని అనుకోండి.. అప్పుడు చెప్పినా పిల్లలు అర్థం చేసుకుంటారు.
  • ‘బోర్‌ కొడుతోంది’... గ్యాడ్జెట్లను తీసుకోవడానికి పిల్లలకు దొరికే పెద్ద సాకు ఇది. వాళ్లకు రాదు, నేనే చేసుకోవాలని పనులన్నీ మీద వేసుకోకండి. ముగ్గుల్లో రంగులు అద్దడం, సామాను సర్దడం, డెకరేషన్‌ వంటి పనులను వాళ్లకి అప్పగిస్తే సరి. మధ్యలో మీరూ పర్యవేక్షిస్తుంటే అందంగా లేదన్న బెంగ మీకూ ఉండదు.
  • ఒక్కోసారి ఏదో అవసరమని మొబైల్‌ చేతిలోకి తీసుకుంటామా! దాన్లో పడి సమయాన్నే మర్చిపోతుంటాం. దీనికీ ముందే సిద్ధమవ్వండి. ప్రతి 10- 20 నిమిషాలకీ అలర్ట్‌ వచ్చేలా ఫోన్‌లో మార్పులు చేసుకుంటే సమస్య ఉండదు. సామాజిక మాధ్యమాలు, ఆప్‌ల నోటిఫికేషన్లు పదే పదే వస్తున్నా తెలియకుండానే చేతులు మొబైల్‌ను తీసుకుంటాయి. వాటిని ఆఫ్‌ చేసుకుంటే ఆ సమస్యా ఉండదు.

ABOUT THE AUTHOR

...view details