Handloom Silver Saree Made By Sirisilla handloom: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన యువ చేనేత కార్మికుడు మగ్గంపై వెండి చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్.. చేనేత చీరల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ మధ్యనే సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరలకు పేరు రావడానికి కారణమయ్యాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. నేడు చేనేతకే అందం తెచ్చేలా వెండి చీరను మగ్గంపై నేశాడు.
సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరకు గుర్తింపు రావడంతో.. ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తల్లి జ్యోతి సిరి చందనం పట్టు చీరతో పూర్తిగా వెండి దారాలతో చీర కావాలని కోరారు. ఆమె కోరిక మేరకు సిరి చందనంకు వచ్చిన గుర్తింపు మేరకు.. అదే స్ఫూర్తితో వెండి చీరను నేశారు. ఈ చీరను నెల పది రోజుల శ్రమించి రూపొందించడం జరిగిందని విజయ్ తెలిపారు.