నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - nandyala district updates
02:10 April 18
మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తింపు
Road Accident In Nandyala :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద హైవేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని మద్దిలేటి అయ్యా స్వామి క్షేత్రానికి వెళ్లి... దర్శంనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, అతడి భార్య లక్ష్మి దేవి, అక్క సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందారు .వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు, నాగమణి, మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:లారీ-బైక్ ఢీ.. మనవడు సహా వృద్ధ దంపతుల మృతి!