Ration dealer suicide attempt: నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తండాలో మహిళా రేషన్ డీలర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు, అధికారుల వేధింపులు తాళలేక... ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శోభారాణిబాయి తెలిపారు. గడివేముల తహసీల్దారు నాగమణి, వైకాపా ఎంపీటీసీ కాలు నాయక్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ తేజానాథ్ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాసులు.. నాటు సారా విక్రయిస్తున్నట్లు తరచూ వేధిస్తుండటంతో.. పురుగుల మందు తాగినట్లు బాధితురాలు చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అధికారుల వేధింపులు తాళలేక.. రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం - Ration dealer suicide attempt
Suicide attempt: అధికారుల వేధింపులు తాళలేక రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం చేసింది. నారాసారా విక్రయిస్తున్నట్లు తరచూ వేధిస్తుండటంతో పురుగుల మందు తాగినట్లు బాధితురాలు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
suicide attempt