ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు శ్రీశైలానికి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లు పూర్తి - నంద్యాల జిల్లా వార్తలు

President Draupadi Murmu Visits Srisailam On Monday: సోమవారం శ్రీశైలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి విందు కోసం అలంకార మండపాన్ని సిద్ధం చేశారు.

శ్రీశైలం
srisailam

By

Published : Dec 25, 2022, 10:28 PM IST

Updated : Dec 26, 2022, 6:25 AM IST

President Draupadi Murmu Visits Srisailam On Monday: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్‌లో రాష్ట్రపతి హైదరాబాద్‌ నుంచి బయల్దేరతారు. అక్కడి నుంచి సున్నిపెంటకు వచ్చి... ఆ తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానంతరం.... 43 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముర్ము పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయానికి ఇరువైపులా రోడ్ల పక్కన తెల్లని పరదాలు కట్టారు. మధ్యాహ్నం విందు కోసం అలంకార మండపాన్ని సిద్ధం చేశారు.

Last Updated : Dec 26, 2022, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details