Police Overaction in Chandrababu Naidu Arrest: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా నడిపించారు. బాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌కు భారీగా తరలివచ్చిన పోలీసులు.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించారు. అరెస్టుకు అడ్డంకులు సృష్టిస్తే చంద్రబాబు బస చేస్తున్న బస్సుతో సహా లాక్కెళతామంటూ అతిగా ప్రవర్తించారు. పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
TDP Chief Chandrababu Naidu Arrested:చంద్రబాబు అరెస్టుకు ముందు అర్ధరాత్రి నుంచే నంద్యాలలో పోలీసులు హైడ్రామా సృష్టించారు. చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంతానికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్న పోలీసులు.. చాలాసేపు అక్కడే కాపు కాశారు. రెండున్న దాటాక ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లి యుద్ధ వాతావరణం సృష్టించారు. అడ్డుగా ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని నెట్టుకుంటూ.. నేరుగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు వద్దకు వెళ్లారు. డీఐజీ రఘురామరెడ్డి నేతృత్వంలో చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు తట్టడంపై.. N.S.G సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
ఎందుకు వచ్చారో తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టంచేశారు. తమ భద్రతా వలయంలో ఉన్న వైఐపీ వద్దకు అర్ధరాత్రి వచ్చి యుద్ధ వాతావరణం సృష్టించే చర్యలను అంగీకరించేది లేదన్నారు. ఇలాంటి చర్యలు ప్రోటోకాల్‌కు విరుద్ధమని N.S.G తేల్చిచెప్పటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. అంతలోనే మాట మార్చారు. చంద్రబాబుకు భద్రత కల్పించేందుకు వచ్చామంటూ సర్దుకునే ప్రయత్నం చేశారు.