AP Civil Special Police Officers: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిసేందుకు రైలులో వెళుతున్న అనంతపురం జిల్లాకు చెందిన యాభై మంది సివిల్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 50 మంది ఏస్పీవోలు విధుల్లోకి తీసుకువాలన్న వినతితో రైలులో వెళుతున్న వారిని నంద్యాలలో గుర్తించి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కల్యాణ మండపంలో వారిని ఉంచారు. ఇబ్బందులు పడ్డామని ఎస్పీవోలు తెలిపారు. ప్రభుత్వం తమను తొలగించందని ఈ విషయాన్ని సజ్జల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సానుకూలంగా స్పందించిన సజ్జల ఎస్పీవోల సంఖ్య చూడాలనే సలహా మేరకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాధాకరం అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల్లో సివిల్ స్పెషల్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్న తమని ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలపై సజ్జలను కలిసేందుకు వెళ్తున్న ఎస్పీవో లను అదుపులోకి తీసుకున్న పోలీసులు - ఆంధ్ర వార్తలు
AP Civil Special Police Officers: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు రైలులో వెళుతున్న అనంతపురం జిల్లాకు చెందిన యాభై మంది సివిల్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Etv Bharat
Last Updated : Jan 24, 2023, 1:21 PM IST