ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామంలోకి వస్తే దాడి చేస్తామని బెదిరింపు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం - రఫీ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Attempted suicide: నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో డీజిల్ పోసుకుని రఫీ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. రఫీ సోదరుడు మాలిక్ బాషాపై దాడి జరిగడం వలన దెబ్బలు తగిలాయి. తమ్ముడిని చూసేందుకు రఫీ ఆస్పత్రికి వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తే దాడి చేస్తామని కొందరు బెదిరించడంతో ఆత్మహత్యకు యత్నించాడు.

Attempted suicide
ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 8, 2022, 6:01 PM IST

Suicide Attempt : నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రఫీ అనే వ్యక్తి డీజిల్ పోసుకుని.. నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన రఫీ సోదరుడు మాలిక్ బాషాను గ్రామానికి చెందిన ఖాసీం, మరికొందరు కలిసి దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ మాలిక్ బాషా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాలిక్​ను చూసేందుకు వచ్చిన రఫీ ఆందోళన చెందాడు. గ్రామంలోకి వస్తే దాడి చేస్తామని బెదిరించడంతో భయపడి ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు రఫీ వాపోయారు. రౌడీల్లా వ్యవహరించి దాడి చేశారని రఫీ భార్య దస్తగిరమ్మ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details