ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రానికి తాళం.. "అద్దె చెల్లించకపోతే ఏం చేస్తాం?" - నంద్యాల జిల్లా తాజా వార్తలు

LOCK TO RBK: అద్దె చెల్లించకపోవడంతో.. రైతు భరోసా కేంద్రానికి ఓ ఇంటి యజమానురాలు తాళం వేసింది. 20 నెలల ఇంటి బాడుగ చెల్లించక పోవడంతో తాళం వేసినట్లు తెలిపింది.

lock to rbk
lock to rbk

By

Published : Jun 22, 2022, 12:04 PM IST

LOCK TO RBK: అద్దె చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్న కారణంతో.. నంద్యాలలో రైతు భరోసా కేంద్రానికి ఇంటి యజమానురాలు తాళం వేసింది. చాపిరేవుల గ్రామంలో వెంకటలక్ష్మి అనే మహిళకు చెందిన భవనంలో.. 3 ఏళ్ల నుంచి రైతు భరోసా కేంద్రం కొనసాగుతోందని పేర్కొంది. అయితే.. ఇప్పటి వరకూ ఎనిమిది నెలల అద్దె మాత్రమే అధికారులు చెల్లించారని తెలిపింది. మిగతా మొత్తాన్ని చెల్లించే పక్రియలో జాప్యం జరుగుతుండటంతో.. తాళం వేయాల్సి వచ్చిందని యజమానురాలు చెబుతోంది.

అద్దె చెల్లించకపోవడంతో రైతు భరోసా కేంద్రానికి తాళం

ABOUT THE AUTHOR

...view details