Nara Lokesh serious allegations against cm jagan: 2024 ఎన్నికల్లో కోటీశ్వరుడు జగన్‌కి కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగనుందని లోకేశ్ తెలిపాడు. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైం లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని లోకేశ్ గుర్తు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేశ్ జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. తడిచిన ధాన్యం కొనమని ఒక రైతు అడిగితే ఎర్రిపప్ప అని తిట్టాడు మంత్రి కారుమూరి నాగేశ్వరావు అని, ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు అని ప్రశ్నించారు. మంత్రి, జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పే వరకూ మీ ప్రభుత్వాన్ని ఎర్రిపప్ప ప్రభుత్వం అని, ఎర్రిపప్ప జగన్ అని పిలుస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
నాది అంబేద్కరిజం... జగన్ ది సైకోయిజం. మీరు అంబేద్కర్ గారి వైపు ఉంటారా? సైకో వైపు ఉంటారా తేల్చుకోండి. రాబోయేది టీడీపీ ప్రభుత్వం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు వడ్డీతో సహా చెల్లిస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి తెచ్చి శిక్షిస్తాం అంటూ హెచ్చరించారు. వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని మొదట ఆలోచించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారేనని తెలిపాడు. తెలుగుగంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయం నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని లోకేశ్ వెల్లడించారు. జగన్ ఒక పిరికోడు అందుకే మీ లోకేశ్‌ని అడ్డుకోవడానికే జీవో1 తెచ్చారని... ఏ1 నువ్వు తెచ్చిన జీవో1 మడిచి పెట్టుకో అని నేను ఆరోజే గుర్తు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఇప్పుడు ఆ జీవోని హైకోర్టు కొట్టేసిందని.. 2024 ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం పక్కానని లోకేశ్ జోష్యం చెప్పారు.