Nandyala Group War In YCP: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పైడాల మండలంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ఆర్థర్ వర్గానికి చెందిన జయరామిరెడ్డిపై.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన నాగిరెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. పింఛన్ల పంపిణీ విషయమై ప్రోటోకాల్ ప్రకారం బైరెడ్డి వర్గీయులను ఎంపీడీవో స్టేజీపైకి పిలిచారు. ఈ విషయమై ఎమ్మెల్యే వర్గీయుడు తనను కూడా పిలవాలంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. ఎస్సై నాగార్జున కల్పించుకొని జయరాం రెడ్డిని అక్కడి నుంచి ఇంటికి పంపించారు. ఎస్సై ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో నందికొట్కూరుకు వస్తుండగా బైరెడ్డి వర్గీయుడు నాగిరెడ్డి అనుచరులు కాపుకాసి దాడి చేశారు. జయరాంరెడ్డిని గాయపరిచి అతని కారు అద్దాలను ధ్వంసం చేశారు.
నందికొట్కూరు వైసీపీలో వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే అనుచరుడిపై దాడి - నందికొట్కూరులో పొలిటికల్ హీట్
Nandyala Group War In YCP: ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగా ఒకే పార్టీలో రెండు వర్గాల వారు కలసి పనిచేయడం కష్టమే అన్నదానికి నంద్యాల వైసీపీ పార్టీలో జరిగిన సంఘటనే నిదర్శనం. ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గానికి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన కొందరు మరోసారి బాహాబాహీకి దిగారు.

Etv Bharat