Nandyal RARS Development Completely Left in Government: వ్యవసాయ పరిశోధనలు ప్రభుత్వానికి పట్టవా? Nandyal RARS Development Completely Left in Government :"ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందంటా".. అన్నట్లుగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్నే అటకెక్కించిన సీఎం జగన్...గ్రామాల్లోని ఆర్బీకేల్లో విత్తన, భూసార పరీక్షలు నిర్వహించేలా తీర్చిదిద్దుతామంటే నమ్మశఖ్యంగా ఉందా..?
Nandyal Regional Agricultural Research Centre Government Thrown Research into Air : రైతన్నలకు ఎంతో ఉపయోగమైన అధిక దిగుబడులు ఇచ్చే సరి కొత్త వంగడాలను సృష్టించిన చరిత్ర కలిగిన నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ (RARS)కు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా విస్మరించి.. అక్కడి పరిశోధనలను అటకెక్కించడమేనాజగన్ చెప్పే రైతు సంక్షేమం.? అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను తయారు చేసే కేంద్రమన్న సంగతి తెలిసి కూడా ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం రైతుల ప్రయోజనాలను విస్మరించడమే. తరుచూ రైతు బిడ్డనంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌కు కనీసం రైతులపై బ్రిటిష్ ప్రభుత్వం చూపిన శ్రద్ధ కూడా లేదు.
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలను సమూలంగా మార్చబోతున్నామని.. రైతులకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చుతున్నామని పదేపదే గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్...రైతుకు అత్యంత ఉపయోగపడే వ్యవసాయ పరిశోధనలపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. వ్యవసాయ పరిశోధనల ప్రాధాన్యాన్ని విస్మరించి వాటి విలువైన భూముల్ని లాక్కుంటున్నారు.
ఆర్‌ఏఆర్‌ఎస్ భూముల్లో మట్టి సర్వే.. అడ్డుకున్న శాస్త్రవేత్తలు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఆవిష్కరించడంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. కొత్త వంగడాల రూపకల్పన, రైతులకు అవసరమయ్యే యంత్రాల ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. దేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ కేంద్రానికి నంద్యాల నడి బొడ్డున 100 ఎకరాల భూములు ఉన్నాయి.
నంద్యాలలో వైద్య కళాశాల నిర్మించ తలపెట్టిన వైసీపీ ప్రభుత్వం ఎన్నో భూములు ఉన్నా.. కీలకమైన ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50 ఎకరాలను కేటాయించింది. రైతులు, రైతు సంఘాలు ఆందోళనకు దిగినా వెనక్కి తగ్గలేదు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా నంద్యాలకు 65 కిలోమీటర్ల దూరంలోని తంగడంచలో భూములు కేటాయించింది. పరిశోధన కేంద్రం ఒకచోట.. భూములు మరొక చోట ఉంటే పరిశోధనలు సాగేదెలా అంటూ శాస్త్ర వేత్తలు ప్రశ్నించారు. నిత్యం పంటలను పరిశీలించాలంటే కష్టం అవుతుందన్నారు. దీంతో తంగడంచలో ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అభివృద్ధిని మాత్రం ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది.
ప్రస్తుతం నంద్యాల ఎంపీగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి గతంలో ఇక్కడే శాస్త్రవేత్తగా పని చేశారు. ఆయన హయాంలోనే ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రాధాన్యాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శాస్త్రవేత్తల నివాస గృహాలకు కేటాయించిన భూముల్లోని కొంత భాగంలో వైసీపీ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. విపక్షాల ఆందోళనతో వెనక్కి తగ్గారు. కొత్త జిల్లా ఏర్పడటంతో కలెక్టర్ కార్యాలయం, డీఆర్ఓ కార్యాలయాలు సైతం ఆర్‌ఏఆర్‌ఎస్ లోనే ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయా కార్యాలయాలు 16 నెలలు ఉండడానికి మాత్రం కోర్టు అనుమతించింది.
సుమారు 117 ఏళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో ఏర్పాటైన ఈ కేంద్రం దేశంలోనే అతి పురాతనమైన వ్యవసాయ పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందింది. 1954 లో పత్తి పరిశోధన స్థానంగా, 1980లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంగా మారింది. వరి, పత్తి, జొన్న, కొర్ర, ప్రొద్దుతిరుగుడు, శనగ, పొగాకు పంటలపై ఇక్కడ నిత్యం పరిశోధనలు సాగుతుంటాయి.
ఎంతో కీలకమైన కేంద్రమైనప్పటికీ దీనికి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వైద్యకళాశాల నిర్మాణానికి కేటాయించింది. ఉన్న భూములే సరిపోవడం లేదని మరో 365 ఎకరాలు కేటాయించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ప్రభుత్వాన్ని కోరితే ఉన్న భూములనే జగన్ సర్కార్ లాక్కోవడం విశేషం.
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ ఏర్పాటుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్