ARREST: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్మికులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. డిమాండ్లు పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు నాలుగో రోజూ సమ్మె కొనసాగిస్తున్నారు. విధులు బహిష్కరించడంతో.. చెత్త పేరుకుపోయింది. అధికారులు కొంతమందిని రప్పించి పారిశుద్ధ్య పనులు చేసేందుకు యత్నించగా.. సమ్మెలో ఉన్న కార్మికులు వారిని.. అడ్డుకున్నారు. పోలీసులు పురపాలక కార్యాలయానికి చేరుకుని పారిశుద్ధ్య కార్మికులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు సమ్మె అణచివేత ప్రయత్నాలను సహించేది లేదని ఆందోళనకారులు హెచ్చరించారు..
ఆళ్లగడ్డలో పారిశుద్ధ్య పనుల అడ్డగింత.. స్టేషన్కి కార్మికుల తరలింపు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ARREST: డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. అధికారుల విజ్ఞప్తి మేరకు పారిశుద్ధ్య పనులు చేసేందుకు వచ్చిన కొంతమంది వ్యక్తులను.. సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఆళ్లగడ్డలో పారిశుద్ధ్య పనుల అడ్డగింత
TAGGED:
స్టేషన్కి కార్మికుల తరలింపు