ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ministers : 'మా దగ్గర వాగులే లేవు.. ఇసుక మాఫియా అని ఎలా అంటారు..!' - మంత్రి బుగ్గన

Ministers : జగన్ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి విడుదల రజని అన్నారు. టీడీపీలో వృద్ధ బృందం ఉందని.. తమ బృందంలో అంతా యువత, పనిచేసే వారు ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో మీడియా సమావేశంలో మంత్రుల మాట్లాడుతూ టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు.

మంత్రులు విడదల రజని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
మంత్రులు విడదల రజని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

By

Published : May 4, 2023, 7:54 PM IST

YSRCP Ministers : తెలుగు దేశం పార్టీ నాయకుల విమర్శలపై మంత్రులు విడదల రజని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి విడుదల రజని అన్నారు. టీడీపీలో వృద్ధ బృందం ఉందని.. తమ బృందంలో అంతా యువత, పనిచేసే వారు ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

అప్పుల మంత్రి అని ఎలా అంటారు.. అప్పుల మంత్రిగా... నన్ను నారా లోకేశ్ అనడం సమంజమేనా అని బుగ్గన ప్రశ్నించారు. అప్పులు, రాబడి ఆర్థిక మంత్రికే సంబంధం ఉంటుందన్నారు. అప్పు చేయకుండా ఏ భవనాన్నీ నిర్మించలేం అని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆర్థికమంత్రిగా కూడా పని చేశాడనే విషయాన్ని లోకేశ్ తెలుసుకోవాలని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో వాగులు లేవని చెప్పిన బుగ్గన.. పాదయాత్రకు వచ్చిన లోకేశ్ తమను ఇసుక దొంగలు అనడం సరికాదని అన్నారు. నంద్యాలలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.

ప్రారంభోత్సవాలు.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో 12 కోట్ల 90 లక్షల రూపాయలతో నిర్మించిన వైద్య పరీక్షల భవన సముదాయం, రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పీజీ మహిళా విద్యార్థుల భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నారు. జగనన్న హయాంలో ఎన్నో ఆస్పత్రులు బాగుపడుతున్నాయి. ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్న పనులకు మద్దతు తెలపకపోయినా.. వీటన్నింటిపై దుష్ప్రచారం మానుకోవాలి. - విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

మా టీం అంతా యువకులే ఉన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎంపీ కూడా అంతా యంగ్​స్టర్స్.. అటు వైపు చూస్తే.. అందరూ కూడా క్రికెట్ టీంలో చివరికి వచ్చి ఆడేవాళ్లే. వాళ్ల వారసులకు ఉన్న అవగాహన కూడా అంతంతే.. పాదయాత్రలో భాగంగా మా నియోజక వర్గంలో పర్యటించి అప్పుల మంత్రి అన్నారు. అప్పులు చేయక తప్పదనే విషయం తెలుసుకోవాలి. అప్పులు చేయకుండా ఇలాంటి భవనాలు నిర్మించగలమా..? ఇసుక దొంగతనం చేయాలంటే ఇసుక ఉండాలి కదా..? మా దగ్గర ఒక్క వాగు కూడా లేదు.. ఇసుక మాఫియా అని ఎలా అంటారు..? పది సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్న జగన్.. ఆ అనుభవంతో ప్రజలకు కావాల్సిన పనులపై దృష్టి పెట్టారు. - బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details