MINISTER AMBATI: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పరిధిలోని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. వెలిగొండ అవుకు టన్నల్ నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు, బానుక చర్ల హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ, అవుకు రిజర్వాయర్లను పరిశీలించామన్నారు.
పోతిరెడ్డిపాడు గేట్ల వ్యవస్థ సక్రమంగా ఉంది.. నీటిలో ఉండటం వల్లే తుప్పు: అంబటి - పోతిరెడ్డిపాడు గేట్ల వ్యవస్థ
Ambati Rambabu: నంద్యాలలోని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. పోతిరెడ్డిపాడు గేట్ల వ్యవస్థ సక్రమంగా ఉందని.. నీటిలో ఉండటం వల్ల గేట్లు తుప్పు పట్టి మరమ్మతులకు గురవుతున్నాయన్నారు.
Ambati Rambabu
పోతిరెడ్డిపాడు గేట్ల వ్యవస్థ సక్రమంగా ఉందని.. నీటిలో ఉండటం వల్ల గేట్లు తుప్పు పట్టి మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్ప చక్రపాణి రెడ్డి, ఆర్థర్, నీటిపారుదల శాఖ అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: