ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం నేపథ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జి మాణికం ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను ఏఐసీసీ నియమించింది.

Manik Rao Thackeray
Manik Rao Thackeray

By

Published : Jan 4, 2023, 10:43 PM IST

Manik Rao Thackeray Incharge Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రేను ఏఐసీసీ నియమించింది. మాణికం ఠాగూర్‌ స్థానంలో.. మాణిక్‌రావు ఠాక్రే కొనసాగనున్నారు. గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఉన్న మాణిక్‌రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు గోవా కాంగ్రెస్‌ బాధ్యతలను ఇచ్చారు. గతంలో మహారాష్ట్ర మంత్రిగా మాణిక్‌రావు ఠాక్రే పనిచేశారు.

మాణిక్‌రావు ఠాక్రేను నియమిస్తూ ఏఐసీసీ లేఖ

అసలేం జరిగిదంటే: కొద్దిరోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ కాస్తా ఏఐసీసీకి చేరింది. దీనిపై స్పందించిన అధిష్ఠానం సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్​ను రంగంలోకి దించింది. హైదరాబాద్​కు వచ్చిన ఆయన రాష్ట్ర నాయకులతో విడివిడిగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి నియమించడంపై పలువురు సీనియర్లు తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, సర్దుకుపోలేక సతమతమవుతూ వస్తున్నట్లు వారు తెలిపారు. దీనికితోడూ ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌పై సీనియర్​ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తిగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తాము ఏమి సూచనలు చేసే పరిస్థితి లేదని దిగ్విజయ్‌ సింగ్​ దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details