Selfy Suicide in Nandyala: ప్రేమించిన యువతి మోసం చేసిందని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో జరిగింది. లక్ష్మాపురం గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు తాను ప్రేమించిన యువతి మోసం చేసిందని ఆవేదనతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాల ఆంజనేయులు మృతి చెందాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ.. ఆత్మహత్యకు ముందు బాల ఆంజనేయులు సెల్ఫీవీడియో తీసి స్నేహితులకు పంపాడు. తాను చనిపోతూ తన రెండు కళ్లను దానం చేశాడు. ఈ ఘటనపై పగడ్యాల పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదని మృతుడి స్నేహితులు సూచించారు.
పురుగుల మందు తాగి ప్రేమికుడు ఆత్మహత్య... సెల్ఫీవీడియో - నంద్యాల జిల్లా తాజా వార్తలు
Selfy Suicide in Nandyala: ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆంజనేయులు సెల్ఫీవీడియో తీసి స్నేహితులకు పంపాడు.
sucide