Biryani for 5 paise in Nandyal: పైసా ఆలోచనతో ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుందామనుకున్నారు.. ఆ హోటల్ యజమాని. మా అయితే పది లేదా ఇరవై మందో వస్తారనుకున్నారు కాబోలు. అయితే ఆఫర్ చూసినవారికి మనస్సు ఒప్పుకుంటుందా..! అది ఈ రోజు 31 మరి.. ఈ రోజు ప్రతి ఒక్కరూ బిర్యానీ తినాలనుకుంటారు. అలాంటిది ఆఫర్ పేరుతో వస్తుంటే ఎవరు కాదంటారు చెప్పండి. అటక మీద పడేసిన పాత సామానులో ఉన్న పైసలను వెతికి మరీ దొరకబుచ్చుకొని వచ్చారు. అలా వచ్చిన వారు ఒక్కరో ఇద్దురో కాదు.. వందల మంది.
పైసాకు బిర్యానీ ఆలోచన.. ఆ హోటల్‌కు పబ్లిసిటీ తెచ్చింది..! - బిర్యానీ వార్త
Biryani for 5 paise: పైసా లేదా అయిదు పైసలనాణేనికి.... ఒక బిర్యాని అని నంద్యాలలో ఓ హోటల్ ప్రకటనతో ప్రజలు బారులు తీరారు. నాణేలతో బిర్యాని కోసం నగరవాసులు ఎగబడ్డారు. క్లాసిక్ జైలు హోటల్ నిర్వాహకులు ఇలా వినూత్నంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేశారు. నగరవాసుల నుంచి వచ్చిన స్పందన చూసి హోటల్ యజమానురాలు సంధ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు
పైసాకు బిర్యానీ
పైసా.. అయిదు పైసా నాణేలు ఇస్తే ఒక బిర్యానీ ఉచితంగా ఇస్తామన్న ఓ హోటల్ నిర్వాహకులు ప్రకటన తో ప్రజలు బారులు తీరారు. నాణేలు తెచ్చి ఇచ్చి బిర్యానీ పట్టుకెళ్లారు. వినడానికి ఆశ్చర్యం కలిగించే ఈ నాణేలకు.. బిర్యాని నంద్యాలలో క్లాసిక్ జైలు హోటల్ నిర్వాహకులు ఇలా వినూత్నంగా చేశారు. నాణేలు కలిగిన వారు హోటల్ వద్ద వరుస కట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇలా చేశామని హూటల్ యజమానురాలు సంధ్య తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 31, 2022, 11:01 PM IST