ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో దుకాణాల కేటాయింపు, కూల్చివేతలపై సానుకూలంగా స్పందించండి: హైకోర్టు - హైకోర్టు

Srisailam Shops Demolition: నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ పిటిషనర్లకు చెందిన 24 దుకాణాలను ఈనెల 20న కూల్చివేసిన కేసులో హైకోర్టు ఈవో హాజరుకావాలని గత విచారణలో ఆదేశించింది. దుకాణాలు కేటాయింపు కోసం దేవస్థానానికి వినతి సమర్పించుకోవాలని న్యాయమూర్తి పిటిషనర్లకు సూచించారు. ఆ వినతిపై సానుకూలంగా స్పందించాలని ఈవోకు న్యాయమూర్తి స్పష్టంచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.

High Court
శ్రీశైలంలో దుకాణాల కేటాయింపు వివాదం

By

Published : Dec 28, 2022, 10:54 AM IST

Srisailam Shops Demolition incident: వ్యాపారులకు దుకాణాల కేటాయింపు, కూల్చివేతలపై వివరణ ఇచ్చేందుకు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న హైకోర్టుకు హాజరయ్యారు. కూల్చివేతల విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ఈవో తరపు న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు. వాస్తవాలను వివరిస్తూ అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ పిటిషనర్లకు చెందిన 24 దుకాణాలను ఈనెల 20న కూల్చివేశారని పిటీషనర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. దీంతో పిటిషనర్లు బజారున పడ్డారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్‌.. దుకాణాలు కేటాయింపు కోసం దేవస్థానానికి వినతి సమర్పించుకోవాలని పిటిషనర్లకు సూచించారు. ఆ వినతిపై సానుకూలంగా స్పందించాలని ఈవోకు స్పష్టంచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.

ఈవో ఎస్‌.లవన్నకు కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తమను దుకాణాల నుంచి ఈవో ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ టి.ఎండీ రఫి మరికొందరు ఈనెల 20న హైకోర్టును ఆశ్రయించారు. ఈవో వ్యవహర శైలితో కొత్తగా నిర్మించిన లలితాంబిక షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనం-2లో సైతం దుకాణాల విషయంలో తమకు ఐచ్ఛికం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పాత షాపుల నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈవో హాజరుకావాలని గత విచారణలో ఆదేశించారు. దీంతో తాజాగా జరిగిన విచారణకు హాజరైన ఈవో కోర్టుకు వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details