ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

traffic jam in Srisailam: తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. ఇరుకైన రహదారి కావడం వల్ల వేలాదిగా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

traffic jam in Srisailam
traffic jam in Srisailam

By

Published : Nov 13, 2022, 6:57 PM IST

Heavy traffic jam in Srisailam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలంలోని టోల్​గేట్​ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలన్నీ రహదారిపై నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇరుకైన రహదారి కావడం వల్ల వేలాదిగా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన శ్రీశైలం పోలీసులు.. ట్రాఫిక్ జామును క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ సమస్య కారణంగా వాహనాలు మెల్లగా నడుస్తున్నాయి. వారాంతం కావడం వలన అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో, ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details