అటు రాత్రంతా హైడ్రామా
chandra babu naidu arrested : అర్ధరాత్రి నుంచే చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. రాత్రే అనంతపురం నుంచి బలగాలను నంద్యాలకు రప్పించారు. చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ రోప్ పార్టీ ఏర్పాటుచేశారు. తమ చర్యలకు అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు అడ్డుపెట్టిన తెలుగుదేశం వాహనాలను జేసీబీతో తొలగించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా బృందాలను బయటకు పంపారు. చంద్రబాబు బస్సు వద్ద ఉన్న నాయకులను అదుపులోకి తీసుకొని...... పోలీసు వాహనాల్లో తరలించారు.కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి,ఎ.వి.సుబ్బారెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, అఖిలప్రియ, ఇతర నేతలను అరెస్టు చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు