Protest in VBIT college: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులోని కొందరి అమ్మాయిల డీపీ ఫొటోలను తీసి వాటిని మార్పింగ్ చేసి గుర్తు తెలియని సెల్ఫోన్ల ద్వారా తిరిగి వారికే పంపిస్తున్నారు. భయందోళనకు గురైన అమ్మాయిలు కళాశాల వసతి గృహం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు భయంగా ఉందని వసతి గృహం నుంచి బయటకు వచ్చి అమ్మాయిలు నిరసన తెలిపారు.
వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత.. ఎన్‌ఎస్‌యూఐ నేతల అరెస్ట్ - తెలుగు తాజా వార్తలు
Protest in VBIT college: తెలంగాణ రాష్ట్రం ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థినుల సెల్ఫోన్లకు అసభ్యకర సందేశాలు రావడం కలకలం రేపింది. దీనిపై హాస్టల్ వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవట్లేదనే కారణంతో.. కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు కళాశాల ముందు ధర్నాకు దిగారు.
ఈ క్రమంలోనే వార్డెన్ ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. వారం రోజులుగా యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తల్లిదండ్రుల ఆందోళనకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగానే పోలీసులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: