Jagananna vidya deevena: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగనన్న వసతి దీవెన రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. రాష్ట్రానికి కొత్తగా మరో 16 మెడికల్ కళాశాలలు వస్తున్నాయన్న సీఎం.. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు.. 84లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోందని వెల్లడించారు. నగదు తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల కళాశాలలకు వెళ్తారన్న జగన్.. కళాశాలల్లో వసతులు ఎలా ఉన్నాయో వారు పరిశీలిస్తారని తెలిపారు.
Jagananna Vasathi Deevena: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: సీఎం జగన్ - విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న సీఎం జగన్
Jagananna vidya deevena: నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. సీఎం జగన్ పాల్గొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: సీఎం జగన్