ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో రెచ్చిపోయిన యువకులు.. రోడ్డుపై పరస్పరం దాడి - నంధ్యాల లో యువకుల పరస్పర దాడి

youngers fight: ఉరకలేసే ఉడుకు రక్తం ఉన్న యువకులు వెర్రెక్కినట్లుగా వీధికెక్కి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది. పాత కక్షలే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Youngers
Youngers

By

Published : Nov 25, 2022, 10:04 PM IST

Youngers fight on Road: డోన్ పట్టణంలో యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షలు మనసులో ఉంచుకుని పరస్పరం దాడికి దిగిన ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది. గత 4 రోజుల క్రితం పట్టణంలోని టీచర్స్ కాలనీలో యువకులు కొట్టుకున్నారు. సుందర్ సింగ్ కాలనీకి చెందిన కొందరు యువకులు ద్వి చక్ర వాహనంపై వేగంగా వచ్చి.. టీచర్స్ కాలనీ యువకులను ఢీకొట్టారు. దీంతో కాలనీలో ఇళ్ల ముందున్న కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్​లో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

తాజాగా ఈ ఘటనను మనసులో పెట్టుకుని యువకులు మరోసారి ఘర్షణకు దిగారు. రోడ్డుపై కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిని కొంతమంది వీడియోలు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details