bears attack: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. అహోబిలానికి చెందిన శ్రీను మరో ఇద్దరు కలిసి జీవనోపాధిలో భాగంగా తేనె సేకరించడానికి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తుండగా.. వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు తప్పించుకోగా.. శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రాథమిక చికిత్స నిర్వహించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.
bear attack: వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే..? - అహోబిలం అటవీ ప్రాంతంలో ఎలుగుల దాడి
bear attack: ఇటీవల పలు జిల్లాలో ఏనుగులు, పులులు.. ఇతర వన్య ప్రాణులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా.. నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.
![bear attack: వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే..? bears attacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16030474-815-16030474-1659770140391.jpg)
ఎలుగుబంటి దాడి