AP JAC President Bopparaju comments: ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం తగదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే కచ్చితంగా జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాలలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యోగులకు కచ్చితంగా 1వ తేదీనే జీతాలివ్వాలి: జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు - govt employees news
AP JAC President Bopparaju comments: ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే కచ్చితంగా జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం ఏ మాత్రం తగదని అన్నారు.
![ఉద్యోగులకు కచ్చితంగా 1వ తేదీనే జీతాలివ్వాలి: జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు Bopparaju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17282853-383-17282853-1671719146620.jpg)
1వ తేదీనే జీతాలు ఇవ్వాలి
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మూడో మహాసభ ఫిబ్రవరి అయిదో తేదీన కర్నూలులో నిర్వహిస్తున్నామని..ఆ సభకు ఉద్యోగులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏల డీఏ, వీఆర్వోల పదోన్నతి, కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను వెంటనే జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సంక్రాంతి లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు కచ్చితంగా 1వ తేదీనే జీతాలివ్వాలి: జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు
ఇవీ చదవండి