నంద్యాలలో ఇటీవల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు ఆలస్యంగానైనా చర్యలు తీసుకున్నారు. విధుల్లోనిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండో పట్టణ సీఐ రమణను సస్పెండ్ చేశారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డితోపాటు ఏఎస్సై కృష్ణారెడ్డిని వీఆర్‌కు పంపారు. సురేంద్రను ఇటీవల రౌడీషీటర్ దారుణంగా హత్యచేశారు. కానిస్టేబుల్‌నే రోడ్డుపై వెంటాడి చంపడం పెద్ద సంచలనమైంది. పోలీసులకే రాష్ట్రంలో రక్షణ లేదంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.
కానిస్టేబుల్ హత్య కేసులో ఇద్దరు సీఐలపై ఉన్నతాధికార్ల చర్యలు - ఏపీ పోలీస్
ఇటీవల నంద్యాలలో జరిగిన పోలీసు కానిస్టేబుల్ సురేంద్ర హత్య ఘటనలో ఇద్దరు సీఐ లు ఓ ఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో పట్టణ సీఐ ఎన్వీ రమణపై సస్పెన్షన్ వేటు పడగా, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఎఎస్సై కృష్ణారెడ్డిలను వీఆర్‌కు పంపారు.
nandyala