Accident in Ramco Cement : నంద్యాల జిల్లా కొలిమి గుండ్ల సమీపంలోని రాంకో సిమెంటు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. వెల్డింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి పశ్చిమ బంగాల్ కు చెందిన రహీం (26 )సుమన్ (23) ఇద్దరు యవకులు మరణించారు. బతుకుదెరువు కోసం వచ్చి మృతి చెందడంతో పరిశ్రమలోపని చేస్తున్న కార్మికులు ఆందోళన చెపట్టారు.
సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి - Accident in Ramco
Ramco Cement: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైయ్యారు. ఈనెల 28న ఈ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో తోటి కార్మికులు నిరసనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నెల 28న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిశ్రమను ప్రారంభించాల్సిఉంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోవడంతో పరిశ్రమ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిశ్రమ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: