Lizard in sambar in AP: నంద్యాలలోని టూరిస్ట్ హోటల్ నిర్వాకంతో యాత్రికులు ఇబ్బందులు పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడకు చెందిన 20 మంది టూరిస్ట్‌లు నంద్యాలలో ఉన్న హోటల్‌లో అల్పాహారంలో తీసుకున్నారు. వారికి వడ్డించిన ఇడ్లీ, సాంబార్లో ఒక వ్యక్తి ప్లేట్లో బల్లి దర్శనమిచ్చింది. ఒక్కసారిగా ఖంగుతిన్న వారంతా ఇదేంటని హోటల్ నిర్వాహుకుడిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు బదులు ఇవ్వక పోగా.. ఇలాంటి ఘటనలు సహజమే అన్నట్లుగా సమాధానం ఇచ్చారని యాత్రికు తెలిపారు. తాము చూడటం వల్ల విషయం బయటపడిందని.... చూడకుండా అలాగే తింటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆదోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు వెల్లడించారు.
ఇడ్లీ.. సాంబార్.. ఓ బల్లి..! - news on Lizard in sambar
Lizard in sambar: నంద్యాల టూరిస్ట్ హోటల్‌లో సరఫరా చేసిన అల్పాహారంలో.. బల్లి ఉండటం కలకలం రేపింది. కాకినాడ నుంచి వచ్చిన 20 మంది టూరిస్ట్ హోటల్‌లో ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశారు. టిఫిన్ తింటుండగా ఒకరి ప్లేట్‌లోని సాంబారులో బల్లి కనిపించింది. దీంతో యాత్రికులు విషయాన్ని హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. ఆందోళనకు దిగారు.
Lizard in sambar
'వివాహ వేడుకల కోసం వచ్చాము. మేము ఉన్నప్పుడే సుమారు 50 మంది వరకు టిఫిన్ చేశారు. పెళ్లి కొడుకు తినే సాంబార్ ఇడ్లీలో బల్లి వచ్చింది. ఇదే విషయం హోటల్‌లో ఉన్న వారిని అడిగితే చిన్న బల్లియే కదా అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే ఇలాంటి ఘటనలు మా హోటల్ లో జరగవు అంటూ చెబుతున్నారు. పైగా తామే బల్లిని వేసినట్లుగా ఆరోపిస్తున్నారు'-. బాధితులు
ఇవీ చదవండి:
Last Updated : Dec 7, 2022, 2:29 PM IST