INNOVATIVE PROTEST: గడప-గడపకు కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. కొన్నిచోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా.. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చిన్నపురెడ్డి అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా తన నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి.. మా గడప తొక్కండి అని బోర్డు మీద రాసి తన ఇంటి ముందు తగిలించారు. ప్యాపిలి మండలం మెట్టుపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిన్నపురెడ్డి... పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
"సీపీఎస్ రద్దు చేసి.. మా గడప తొక్కండి" - నంద్యాల జిల్లా తాజా వార్తలు
INNOVATIVE PROTEST: రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు, మంత్రులు.. "గడప-గడపకు ప్రభుత్వం" అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే.. కొన్నిచోట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. తాజాగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.
డోన్‌లో ఉపాధ్యాయుడి వినూత్న నిరసన