GOVT HOLIDAYS LIST IN 2023: 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ పర్వదినాలు, జాతీయ సెలవు దినాల తేదీలను సూచిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాదున్ నబి తేదీల్లో మార్పు చేర్పులను తదుపరి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
2023లో ప్రభుత్వ సెలవులు ఎన్నో తెలుసా..!
2023 GOVT HOLIDAYS IN AP: 2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవు తేదీలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ పర్వదినాలు, జాతీయ సెలవు దినాల తేదీలను సూచిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. 2023 ఏడాదిలో మొత్తంగా 23 రోజులను సాధారణ సెలవుదినాలుగా పేర్కోంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.
2023 GOVT HOLIDAYS IN AP
2023 జనవరి 14, 15, 16 తేదీల్లో వచ్చే భోగి మకర సంక్రాంతి, కనుమ పండుగల తేదీని సాధారణ సెలవుల జాబితాలో ప్రభుత్వం పేర్కొంది. 2023 మార్చి 22వ తేదీన ఉగాది పండుగ సెలవును ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి పండుగలు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 2023 ఏడాదిలో మొత్తంగా 23 రోజులను సాధారణ సెలవుదినాలుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవీ చదవండి