2000 Rupees Notes Exchange Fraud: రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతున్న క్రమంలో పలు మోసాలు చోటు చేసుకుంటున్నాయి. భారీగా డబ్బులు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. వీటి కోసం ఆ ముఠా చెప్పిన డీల్‌కి ఒప్పుకుంటే.. వారికి చిక్కినట్టే. భారీగా డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి వెలుగు చూసింది.
రద్దవుతున్న రెండు వేల నోట్లు మార్పిడి పేరుతో భారీ మోసం జరిగింది. 1700 రూపాయలు ఇస్తే 2000 రూపాయల నోటు ఇస్తామని నమ్మబలికి ముఠా.. ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకెళ్లిన ఘటన నంద్యాలలో జరిగింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 70 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency Notes Seized in Srikakulam District: రూ.2 వేల నోట్లు మారుస్తామని మోసం.. రూ.55 లక్షల విలువైన దొంగనోట్లు పట్టివేత
భారీగా డబ్బులు వస్తాయనే ఆశతో: నంద్యాల పట్టణంలోని నూనెపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డికి గుంతకల్లుకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తమ వద్ద రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని వాటిని మారిస్తే 15 శాతం కమిషన్ ఇస్తామని వరప్రసాద్ నమ్మబలికాడు. భారీగా డబ్బులు వస్తాయని వరప్రసాద్ చెప్పిన డీల్‌కు శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు.
శ్రీనివాస రెడ్డి, మరో అయిదుగురితో కలిసి 2.20 కోట్ల రూపాయలు సేకరించాడు. అనంతరం వరప్రసాద్ అనే వ్యక్తికి.. తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ డీల్‌కు గాను 30 లక్షల రూపాయలు పైగా కమీషన్ ఇచ్చేందుకు వరప్రసాద్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై 20వ తేదీన నంద్యాల సమీపంలోని రైతు నగరం వద్దకు వరప్రసాద్‌తో పాటు మరో ఏడుగురితో కూడిన ముఠా.. రెండు వాహనాల్లో వచ్చి శ్రీనివాస రెడ్డి నుంచి 2.20 కోట్ల రూపాయలు తీసుకున్నారు.
2000 Notes Exchange Fraud: నోట్ల మార్పిడి మోసం.. 80 లక్షలతో ముఠా ఉడాయింపు..!
ఒక్కసారిగా పోలీస్ సైరన్.. అంతా ఉరుకులు పరుగులు: ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ సైరన్ మోగడంతో అందరూ కంగారుపడి వెళ్లిపోయారు. అయితే ఆ పోలీస్ సైరన్‌తో వచ్చిన వాళ్లు.. ఆ ముఠాలోని కొందరు కావడంతో శ్రీనివాస రెడ్డి మోసపోయాడు. మొత్తంగా 2.20 కోట్ల రూపాయలను తీసుకుని ఆ ముఠా సభ్యులు ఉడాయించారు.
బాధితుడు శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టంకశాల శోభన్ బాబు, కంచరణ చినబాబు అని పోలీసులు వివరించారు. వారి వద్ద నుంచి 70 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ముఠాలోని మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుని.. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేస్తామని డీఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.
2000 Rupees Notes Exchange Fraud: రెండు వేల నోట్ల మార్పిడి పేరుతో 2.2 కోట్ల రూపాయల మోసం.. Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు