ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో యువరైతు మృతి - కర్నూలు జిల్లా బనగాన పల్లెలో రైతు మృతి

బనగానపల్లి పట్టణంలోని కొండపేటకు చెందిన రామచంద్రుడు(35) అనే యువరైతు అప్పుల బాధతో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Yuvraith's death with a debt
అప్పుల బాధతో యువరైతు మృతి

By

Published : Feb 18, 2020, 6:58 PM IST

అప్పుల బాధతో యువరైతు మృతి

కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేటకు చెందిన యువరైతు రామచంద్రుడు(35) పట్టణ సమీపంలోని పొలంలో వరి పంటకు మందు కొడుతుండగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తనకు ఉన్నఅర ఎకరం పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా పంటలు పండక సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. మృతునికి భార్య జయమ్మ పిల్లలు మేఘన ,హేమంత్ ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామచంద్రుని మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం

ABOUT THE AUTHOR

...view details