ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహబూబాబాద్‌లో వైఎస్‌ షర్మిల అరెస్ట్‌..హైదరాబాద్​కు తరలింపు - షర్మిల బహిరంగా సభ

YSRTP president YS Sharmila arrested: తెలంగాణ రాష్ట్ర వైయస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. షర్మిలను అరెస్ట్‌ చేసి హైదరాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 19, 2023, 10:56 AM IST

YSRTP president YS Sharmila arrested: తెలంగాణ రాష్ట్ర వైయస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. వైఎస్‌ షర్మిలను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం మహబూబాబాద్​లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని మరోసారి అరెస్ట్‌ చేశారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని షర్మిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు:శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైయస్సార్​టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పద జాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

భారాస శ్రేణుల భారీ రాస్తారోకో, ధర్నా:ఆదివారం తెల్లవారుజాము నుండే భారాసా శ్రేణులు షర్మిల బస చేసిన ప్రాంతం మహబూబాబాద్ మండలం బేతాలు శివారుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారాస శ్రేణుల నినాదాలతో షర్మిల బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం తండా వద్ద 365 జాతీయ రహదారి పై ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో భారాస శ్రేణులు భారీ రాస్తారోకో, ధర్నా చేపట్టి వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను ధగ్గం చేశారు. శ్రేణులు షర్మిల బస చేసిన గూడారాలపై దాడి చేస్తారో మోనని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగాకుండా పోలీసులు భారీగా మోహరించారు. కోర్ట్ ఉత్తర్వులను ధిక్కరించి షర్మిల ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో షర్మిల యాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.

పోలీసులను నిలువరించిన షర్మిల: షర్మిల బస్సులో ఉండటంతో షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు బస్సుని తరలిస్తామని, పోలీసులు షర్మిల సిబ్బందిని హెచ్చరించడంతో షర్మిల బస్సు తలుపులు తీసింది. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్​కు పోలీస్ వాహనంలో తరలించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details