ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేలతలమర్రి పంచాయతీ... మళ్లీ రీ కౌంటింగ్ చేయండి' - నేలతలమర్రి పంచాయతీ ఎన్నికలు

సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్​లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి అన్యాయం జరిగిందని... కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా నేతలు ధర్నా చేశారు. మళ్లీ రీ కౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ysrcp protest at nelathalamarri
నేలతలమర్రిలో వైకాపా నేతల ధర్నా

By

Published : Feb 25, 2021, 1:43 PM IST

కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద నేలతలమర్రికి చెందిన వైకాపా నేతలు ధర్నా చేశారు. దేవనకొండ మండలం నేలతలమర్రి గ్రామ సర్పంచ్​గా వైకాపా బలపరిచిన అభ్యర్థిగా గొల్ల మల్లమ్మ పోటీ చేశారు. ఈనెల 21న జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థికి అన్యాయం జరిగిందని వారు కలెక్టర్​కు ఫిర్యాదు చేసేందుకు కర్నూలుకు వెళ్లారు. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ ఎన్నికలలో కౌంటింగ్ అనంతరం మల్లమ్మ 5 ఓట్లతో గెలిచారని అధికారులు ప్రకటించి... తరువాత రీ కౌంటింగ్ నిర్వహించారని నాయకులు పేర్కొన్నారు. రీ కౌంటింగ్​లో 4 ఓట్లతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు చెప్పారని తెలిపారు. అందుకే రీకౌంటింగ్ అడుగుతున్నామని వివరించారు.

ఇదీ చూడండి.మందపైకి దూసుకొచ్చిన లారీ.. 45 గొర్రెలు మృతి

ABOUT THE AUTHOR

...view details