ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cyber crime: సైబర్​ మోసం.. బోల్తా పడ్డ వైకాపా ఎంపీ - వైకాపా ఎంపీ సంజీవ్‌ కుమార్‌

Cyber crime: ఓ సైబర్ నేరగాడి చేతిలో.. కర్నూలు ఎంపీ మోసపోయారు. ఆయన ఖాతా నుంచి రూ.97 వేలు క్షణాల్లో ఖాళీ అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్న సైబర్ నేరస్థుడు.. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు.

YSRCP MP sanjeev kumar cheated by cyber criminal
సైబర్‌ నేరగాడి చేతిలో మోసపోయిన వైకాపా ఎంపీ

By

Published : May 4, 2022, 9:28 AM IST

Cyber crime: కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌.. సైబర్‌ నేరగాడి వలలో పడి మోసపోయారు. మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిందని, వెంటనే పాన్‌ నంబరుతో జత చేసి అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్‌ నంబరు నుంచి ఆయన సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారంతో పాటు లింకు వచ్చింది. ఆయన దానిని నమ్మి లింకులో వివరాలను నమోదు చేసి పంపగా.. ఓటీపీ నంబర్లు వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు.

ఆ వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700 ఒకసారి,.. రూ.48,999 మరోసారి డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారాలు వచ్చాయి. అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్‌ చేయగా అసలు విషయం తెలిసింది. దాంతో సైబర్‌ నేరగాడు తనను మోసగించి మొత్తం రూ.97,699 తన ఖాతా నుంచి కాజేసినట్లు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details