కర్నూలు పర్యటనలో నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. లోకేశ్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని..కనీసం విజ్ఞత లేకుండా సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రిపై లోకేశ్ దుర్భాషలాడటం అందరినీ బాధించిందని, మాట్లాడిన మాటలకు గాను చంద్రబాబు సహా లోకేశ్ లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో హత్యారాజకీయాలను ప్రోత్సాహించింది తెదేపానని సుధాకర్ బాబు విమర్శించారు.
సీఎం జగన్పై లోకేశ్ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి: టీజేఆర్ - YSRCP MLA Sudhkarbabu news
సీఎం జగన్పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని వైకాపా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. లోకేశ్ రాజకీయాల్లో రాణించలేకే జనంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు