తమ భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని ఆరోపిస్తూ.. కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. మండిగిరి పంచాయతీలోని 444 డి1 సర్వే నెంబర్ వద్ద 70 సెంట్ల భూమిని 18 మంది కొనుగులు చేశారు.
రేకుల షెడ్లల్లో..
సదరు భూమిలో రెండు కుటుంబాలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయి. కొన్ని నెలలు క్రితం రేకుల షెడ్డును అధికార పార్టీ నేతలు తొలగించారని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు చెందిన ఎర్రిస్వామి, గిడ్డు మల్లి, మరికొందరు నేతలు తమ భూమిపై కన్నేసి తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.