కర్నూలు జిల్లా కపటి గ్రామంలో తెదేపా శ్రేణులపై దాడి జరిగింది. అది వైకాపా నేతల పనే అని బాధితులు ఆరోపిస్తున్నారు. "గ్రామంలో సర్పంచ్ గా గెలిచింది తెదేపా అభ్యర్థే అయినా.. అధికారం మాత్రం మాదే" అంటూ.. వైకాపా నేతలు వ్యాఖ్యానించడమే వివాదానికి దారి తీసిందని.. తర్వాత జరిగిన ఘర్షణలో వారే దాడి చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఏం జరిగింది?
ఆదోని మండల పరిధిలోని కపటి గ్రామ సచివాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. తెదేపా నేత, గ్రామ సర్పంచ్ కీర్తితో పాటు.. అక్కడి అధికారులు.. తెదేపా, వైకాపా నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. బోరు ఏర్పాటు విషయంపై చర్చించారు. మాటా మాటా పెరిగి ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ మొదలై.. దాడి వరకు వెళ్లింది. రాళ్లు, కర్రలతో కొందరు చేసిన దాడిలో.. తెదేపా కార్యకర్తలు ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులను ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తెదేపా నేత భూపాల్ చౌదరి.. బాధితులను పరామర్శించారు. దాడిని ఖండించారు.
ఇవీ చూడండి:
'భవిష్యత్ అవసరాలు తీర్చేలా నూతన విద్యా విధానం'