ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు వస్తున్నారని భయంతో పరిగెత్తుతూ యువకుని మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. రహదారి వద్ద కూర్చున్న పెద్ద హరివాణం గ్రామస్థులను.. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు లాఠీలతో తరిమారు. పోలీసుల లాఠీ దెబ్బలను తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

youth died in an attempt to escape from police in kurnool district
పోలీసుల చర్యల్లో పెద్ద హరివాణం యువకుడు మృతి

By

Published : Mar 27, 2020, 6:24 AM IST

పోలీసుల తీరుతో పెద్ద హరివాణం యువకుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో పోలీసుల తీరు వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన వీరభద్రస్వామి.. బెంగళూరు వలస వెళ్లి లాక్​డౌన్​ కారణంగా స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో యువకులతో కలిసి రహదారి పక్కనే కూర్చోగా.. ఎవరూ ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తూ పోలీసులు అక్కడికి వచ్చారు. గుంపుగా కూర్చున్న వీరభద్రస్వామి బృందాన్ని వెంబడించడం వల్ల భయపడి పరిగెత్తారు. ఈ క్రమంలో వీరభద్రస్వామి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details