కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో వాలంటీర్ కృష్ణపై.. అదే గ్రామానికి చెందిన నాగ శేషు, మస్తాన్, కరీం అనే యువకులు దాడికి దిగారు. తమ కుటుంబాలకు రేషన్ రాకపోవడానికి కారణం అతనే అంటూ మూకుమ్మడిగా చితకబాదారు. చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకున్నా.. వెనక్కు తగ్గలేదు.
తీవ్రంగా గాయపడిన వాలంటీర్ కృష్ణను.. అతడి బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గాయపడిన కృష్ణను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరామర్శించారు. కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.