కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ప్రమాదం జరిగింది. ఘటనలో.. గూడూరుకు చెందిన చేపల శ్రీనివాసులు(26) అనే యువకుడు మరణించాడు. శ్రీనివాసులు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో.. కర్నూలు నుంచి గూడూరు వైపు వేగంగా దూసుకెళ్తున్న కారు అతడిని ఢీకొంది. గాయాలపాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందాడు. యువకుడు కోడుమూరులోని పులకుర్తి గ్రామంలో.. పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కారు ఢీకొని యువకుడి మృతి - youngster died in road accident at gudur
కర్నూలు జిల్లా గూడూరులో కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఉదయం నడకకు వెళ్లిన శ్రీనివాసులు అనే యువకుడిని.. కర్నూలు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![కారు ఢీకొని యువకుడి మృతి boy died in accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:58:03:1619616483-ap-knl-111-28-cardheeki-yuvakudu-mruti-ab-ap10204-28042021164912-2804f-1619608752-580.jpg)
boy died in accident