కర్నూలు జిల్లా ఆదోని కోర్టు సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసుకొని హల్చల్ చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రుడిని పోలీసులు, స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. యువకుడు చికిత్సకు సహకరించక పోవటంతో చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి వైద్యులు చికిత్స చేశారు. పోలీసులు ఫోన్ ద్వారా యువకుడి భార్యను సంప్రదించగా... కొన్ని నెలలుగా బెంగళూరులో తన భర్త పని చేస్తున్నట్టు ఆమె వివరించింది. ఎందుకు ఆదోని వచ్చి కత్తితో దాడి చేసుకున్నాడో తమకు తెలియదని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
ఆదోనిలో ఉత్తరప్రదేశ్ యువకుడి ఆత్మహత్యాయత్నం - ఆదోనిలో ఉత్తర్ ప్రదేశ్ యువకుడు ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసుకొని హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
![ఆదోనిలో ఉత్తరప్రదేశ్ యువకుడి ఆత్మహత్యాయత్నం .](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5582018-228-5582018-1578052618522.jpg)
కత్తితో దాడి చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ యువకుడు
కత్తితో దాడి చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు